మహాత్మ జ్యోతిరావు పూలే సేవలు చిరస్మరణీయం

మహాత్మ జ్యోతిరావు పూలే సేవలు చిరస్మరణీయం
తొర్రూరు, ఆంధ్రప్రభ : మహాత్మ జ్యోతిరావు పూలే చేసిన సేవలు చిరస్మరణీయమని బిసి వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు పెదగాని సోమయ్య అన్నారు. శనివారం జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా తొర్రూరు బస్టాండ్ ఆవరణలో డిపో ఎస్టిఐ జి రజిత రెడ్డితో కలిసి జ్యోతిరావు పూలే ఫోటో ఆవిష్కరించి నివాళులు అర్పించారు. అనంతరం సోమయ్య మాట్లాడుతూ సమాజంలో అంటరానితనం కుల వ్యవస్థ నిర్మూలలపై పోరాడిన మహనీయులు జ్యోతిరావు పూలే అని, అలాంటి మహానీయుడి ఆశ సాధన కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలకు చదువు నేర్పిస్తే సమాజం బాగుంటుందని గురించి తన భార్య సావిత్రిబాయి పూలేకు చదువు నేర్పించారన్నారు.ఆయన సేవలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలన్నారు.
ఈ కార్యక్రమంలో స్టేషన్ మేనేజర్ ఎస్. మల్లికార్జున్,బస్టాండ్ కంట్రోల్ ఎం.సురేష్ బాబు,బీసీ వెల్ఫేర్ డిపో అధ్యక్షులు జి.శ్రీలత, డిపో కార్యదర్శి ఎస్ వెంకన్న, వర్కింగ్ ప్రెసిడెంట్ వి.యాకన్న, పి.సుధీర్, కొండ బత్తుల శ్రీను, ఆర్గనైజ్ సెక్రెటరీ ఎస్. సప్న, జె.మాధవి, ఎస్.రాజేశ్వరి, కె.రాధిక,పి. కొమురవెల్లి,చీప్ అడ్వైజర్లు ఎం.శంకర్, ఎంకే రావు, దీకొండ వెంకటయ్య, జి.రమేష్, టి.రవీందర్, జి.యాకన్న, గ్యారేజ్ సెక్రెటరీ గట్టు భాస్కర్,మీడియా ఇంచార్జ్ మారపెల్లి గోపి, అడిషనల్ సెక్రటరీ ధనంజయ, వరంగల్ రీజియన్ వైస్ ప్రెసిడెంట్ సిహెచ్ వనిజ, చీఫ్ హార్డ్వేర్ ఎస్ నాగేశ్వరరావు, టి.రవీందర్, వడ్లకొండ వెంకటేశ్వర్లు, వై. రామ్మూర్తి, పి.రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
