కాసిపేట మండలంలో పోలీసుల ‘కార్డన్ అండ్ సెర్చ్’..

కాసిపేట మండలంలో పోలీసుల ‘కార్డన్ అండ్ సెర్చ్’..
43 వాహనాలకు జరిమానా
180 లీటర్ల గుడుంబా పానకం ధ్వంసం*
ప్రజలకు సైబర్ క్రైమ్, కొత్త చట్టాలపై అవగాహన*
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా, మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్ ఉత్తర్వుల మేరకు శనివారం ఉదయం కాసిపేట మండలంలోని లంబాడి తండా (డీ) గ్రామంలో ‘కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్’ (కార్డన్ అండ్ సెర్చ్) నిర్వహించారు. బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్, మందమర్రి సీఐ రమేష్ పర్యవేక్షణలో దేవాపూర్, కాసిపేట, రామకృష్ణాపూర్ ఎస్సైలు, సిబ్బంది ఉదయం 6 నుండి 8 గంటల వరకు ఈ తనిఖీలు చేపట్టారు.
నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు..
గ్రామంలోని ప్రతి ఇంటిని తనిఖీ చేస్తూ అపరిచిత వ్యక్తులు, అనుమానితులకు ఎవరైనా ఆశ్రయం కల్పిస్తున్నారా అనే కోణంలో గుర్తింపు కార్డులను పరిశీలించారు. ఈ సోదాల్లో సరైన ధ్రువపత్రాలు, నంబర్ ప్లేట్లు లేని 43 ద్విచక్ర వాహనాలను గుర్తించి జరిమానా విధించారు. మరో రెండు వాహనాలను సీజ్ చేశారు. అలాగే అక్రమంగా నిల్వ ఉంచిన 180 లీటర్ల గుడుంబా పానకాన్ని పోలీసులు ధ్వంసం చేశారు.

అవగాహన కల్పించిన పోలీసులు..
ఈ సందర్భంగా దేవాపూర్ ఎస్సై గంగారాం స్థానిక ప్రజలకు పలు కీలక అంశాలపై అవగాహన కల్పించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గంజాయి సాగు లేదా వినియోగం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామాల్లో సీసీ కెమెరాల ప్రాముఖ్యత, ట్రాఫిక్ నిబంధనలు, హెల్మెట్ ధరించడం మరియు కొత్త చట్టాలపై వివరించారు. మూఢనమ్మకాలను నమ్మవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో కాసిపేట ఎస్సై ఆంజనేయులు, ఆర్కేపీ ఎస్సై శ్రీధర్,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
