బిజెపి 47వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు..

బిజెపి 47వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు..
పరకాల, ఏప్రిల్ 6 (ఆంధ్రప్రభ): పరకాల పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అధిష్టానం పిలుపుమేరకు బీజేపీ జెండాను ఆవిష్కరించడం జరిగింది.బిజెపి పరకాల పట్టణ అధ్యక్షుడు గాజుల నిరంజన్ ఆధ్వర్యంలో నిర్వహించి బిజెపి పరకాల పట్టణ కార్యాలయం వద్ద గాజులు నిరంజన్ బిజెపి జెండా ఆవిష్కరించారు, ఈ వేడుకలకు ముఖ్య అతిదులుగా బిజెపి పరకాల కంటెస్టెడ్ ఎమ్మెల్యే, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ కాళీ ప్రసాద్ రావు, రాష్ట్ర నాయకులు డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ కాళీ ప్రసాద్ రావు శక్తి స్థల్ (మార్కెట్ రోడ్డు) వద్ద బిజెపి జెండా ఆవిష్కరించి బిజెపి పరకాల పట్టణంలోని ప్రతి బూత్ లో బూత్ అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరించిన సందర్భంగా వారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు, దేశం కోసం అంకితభావంతో పనిచేసే ప్రతి కార్యకర్తకు ఈ రోజు ఒక ప్రేరణ. బీజేపీ కేవలం ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదు దేశభక్తి, సేవ, మరియు సుశాసనం కోసం నడిచే ఒక మహోన్నత ఉద్యమం. బీజేపీ జెండా ఎగురుతున్న ప్రతి క్షణం, “సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్” అనే మా సంకల్పాన్ని మరింత బలపరుస్తుంది. భారత దేశాన్ని ప్రపంచంలో అగ్రస్థానానికి తీసుకెళ్లే దిశగా, ప్రతి కార్యకర్తగా మన బాధ్యతను నెరవేర్చుదాం అన్నారు. బిజెపి
రాష్ట్ర నాయకులు డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్ మాట్లాడుతూ “దేశమే ప్రథమం” (నేషన్ ఫస్ట్) అనే నినాదంతో, అంత్యోదయ లక్ష్యంగా, కోట్ల మంది కార్యకర్తల కృషితో సామాన్య ప్రజల గొంతుకగా మారిన ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ ‘భారతీయ జనతా పార్టీ’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
