భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
మర్రిగూడ ఏప్రిల్ 06 (ఆంధ్రప్రభ): భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు పాత్లావత్ రాజేందర్ నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భాజపా శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని జెండా ఆవిష్కరణ చేసి స్విట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి అమరేందర్ రెడ్డి, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు పిట్టల శ్రీనివాస్, గ్యార గోపాల్, అశోక్ రెడ్డి, పందుల రాములు గౌడ్, వేనేపల్లి శ్రీనివాసరావు ప్రధాన కార్యదర్శులు చాపల వెంకటేష్, ప్రదీప్ రెడ్డి, రవీందర్ రెడ్డి, మర్రిగూడ ఉప సర్పంచ్ మహేశ్వరం రమేష్, వెంకటేష్ గ్యార యాదగిరి, కుమారస్వామి నరసింహచారి, యువ మోర్చా అధ్యక్షులు ఆయిలి పెద్దలు గౌడ్, కుక్కల వెంకటేష్, బూత్ అధ్యక్షులు దేవేందర్, వెంకటేష్, రమేష్ కార్యకర్తలు పాల్గొన్నారు.
