TG | రాష్ట్రస్థాయికి ఎంపికైన బాలికకు ఘనసన్మానం

TG | రాష్ట్రస్థాయికి ఎంపికైన బాలికకు ఘనసన్మానం

TG | నల్లబెల్లి, ఆంధ్రప్రభ : మండల కేంద్రానికి చెందిన రామిని అర్చన వెంకటేష్ దంపతుల పెద్ద కుమార్తె స్నేహిత ఇటీవల జిల్లా స్థాయి రగ్బీ క్రీడలో రానుంచి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. రాష్ట్రస్థాయికి ఎంపికైన స్నేహితులు నల్లబెల్లి మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సోమవారం శాలువా కప్పి ఘనంగా సన్మానించడంతోపాటు మండల అధ్యక్షుడు నీల వెంకటేశ్వర్లు గుప్తా నగదు పారుతోషికాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సంఘం అధ్యక్షుడు మురికి రవీందర్, యువజన సంఘం అధ్యక్షుడు రాముని సంతోష్, గంగిశెట్టి శ్రీనివాస్ గుప్తా, పురాం, సతీష్ పుల్లూరి శివప్రసాద్, రామిని చంద్రమౌళి అరుణ, వెంకటేష్ తదితరులు పాల్గొని ఆ బాలికకు శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు దేశస్థాయి అంతర్జాతీయ స్థాయికి క్రీడల్లో ఎదిగి ఉన్న ఊరికి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని వారు శుభాకాంక్షలు తెలియజేశారు.

బీజేపీ ఆధ్వర్యంలో

మండల కేంద్రానికి చెందిన రామిని స్నేహిత రగిబీ క్రీడలో రానుంచి రాష్ట్ర స్థాయికి ఎంపికైన సందర్భంగా నల్లబెల్లి మండల బిజెపి శ్రేణులు సోమవారం శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం బీజేపీ మండల అధ్యక్షుడు తడక వినయ్ గౌడ్ మాట్లాడుతూ… పాఠశాల స్థాయి నుండి క్రీడల్లో రాష్ట్ర స్థాయికి ఎదిగిన స్నేహిత మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని వారు ఆకాంక్షించారు అనంతరం శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లాస్థాయి మండల స్థాయి గ్రామస్థాయి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply