ముందస్తు అరెస్ట్‌లు

ముందస్తు అరెస్ట్‌లు

సీఎం పర్యటన నేప‌థ్యంలో పోలీసుల చ‌ర్య‌లు

ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాలో సోమవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు గొడవలు జరగకుండా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఉట్నూర్ ఎస్సై విజయ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు ముందుస్తు చ‌ర్య‌లు తీసుకున్నారు. ఈరోజు ఉదయం బీఆర్ఎస్, బీజేపీ నాయకులను ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అరెస్ట్ అయిన వారిలో బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి మండల అధ్యక్షులు, మాజీ ఎంపీపీ పంద్ర జైవంతరావు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ భరత్ చౌవాన్, బీఆర్‌ఎస్వి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు ధరణి రాజేష్, బీజేపీ ఉట్నూర్ మండల అధ్యక్షులు బింగి వెంకటేష్ తోపాటు ఆ పార్టీల నాయకులను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా అరెస్ట్ అయిన వారు మాట్లాడుతూ సీఎం పర్యటన సందర్భంగా తమను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని, ప్రజాస్వామ్యంలో హక్కులు అడగడం ప్రతి ఒక్కరి నైతిక హక్కు అని వారు అన్నారు. అరెస్ట్ అయిన వారి నుంచి సంతకాలు తీసుకొని సొంత పూచికత్తుపై విడుదల చేశారు.

Leave a Reply