నేటి బందుకు సంపూర్ణ మద్దతు..

నేటి బందుకు సంపూర్ణ మద్దతు..

జిల్లా మెడికల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నేరెళ్ల ప్రమోద్

నిర్మల్ రూరల్, ఆంధ్రప్రభ : ఇటీవల జరిగిన చిన్న పిల్లల వైద్యులు డాక్టర్ సి . సంతోష్ రాజు పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం నేడు వివిధ సంఘాల పిలుపుమేరకు ఇచ్చిన బందుకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు నిర్మల్ జిల్లా మెడికల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నేరెళ్ల ప్రమోద్ ఒక ప్రకటనలో ప్రకటించారు. ఇటీవల కాలంలో తరచూ వైద్యులపై జరుగుతున్న దాడులు హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు. భవిష్యత్తులో వైద్యులపై దాడులు జరగకుండా ఉండాలంటే దోషులపై కఠినమైన చర్యలు తీసుకుంటేనే ఈ మరో మారు దాడులు పునరావత్వం కావని ఆయన వ్యక్తపరిచారు. సందర్భంగా తన మనోభావాన్ని వ్యక్తపరిచారు. శనివారం జరగబోయే బందుకు మా జిల్లా మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంపూర్ణ పూర్తి మద్దతిస్తున్న మనీ తెలిపారు. నిందితులని కఠినంగా శిక్షించాలని అసోసియేషన్ ద్వారా కోరుతున్నాం నిందితులను శిక్షించే వరకు తమ మద్దతు ఇలాగే కొనసాగుతుందని మరో మారు తన ఆవేదనను వ్యక్తపరిచారు.

Leave a Reply