ఏటవాలు వంతెన ను పరిశీలించిన కలెక్టర్ హరిత

ఏటవాలు వంతెన ను పరిశీలించిన కలెక్టర్ హరిత

జైనూర్, ఆంధ్రప్రభ : కొమరం భీ0 అసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని గౌరీ కోలాం గూడ గ్రామ పంచాయతీ గ్రామానికి వెళ్లే లెండిగూడ సమీప0 లోని రహదారిలో లో లెవల్ వంతెనను అసిఫాబాద్ జిల్లా కలెక్టర్ హరిత పరిశీలించారు. ఈ వంతెన వల్ల ప్రజలకు కలిగే ఇబ్బందులను అధికారులతో అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలంలో వరద నీరు వంతెన పై నుండి పారడంతో రాకపోకలకు ఇబ్బందుల అవుతున్నాయని ఎంపీడీవో సుధాకర్ రెడ్డి కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలోఎంపీడీఓ సుధాకర్ రెడ్డి,ఎంపీవో భూక్యా శశికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply