భోజనం చేసే వచ్చేలోపే బైక్ చోరి

భోజనం చేసే వచ్చేలోపే బైక్ చోరి

జుక్కల్ (కామారెడ్డి) ఆంధ్రప్రభ : జుక్కల్ మండలంలోని ఖండేబల్లూర్ గ్రామంలో బైక్ మెకానిక్ అన్నం తిని వచ్చేలోపే బైక్ చోరి అయినా ఘటన చోటుచేసుకుంది.రాజుల్ల చెందిన మొహ్మదాబాద్ అహేమద్ ఖండేబల్లూర్ లోని బైక్ మెకానిక్ అయిన షఫీ తమ బంధు కావడంతో బైక్ రిపేర్ కోసం రఫీ దగ్గర పెట్టడం జరిగింది.వారు అన్నం తిని వచ్చేలోపే గుర్తు తెలియని వ్యక్తులు (ఏపీ 25 ఏఎన్ 1140)నెంబర్ గల షైన్ బైక్ ను దొంగలించడం జరిగింది.బైక్ యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చెయ్యటం జరిగిందని, ఎక్కడైనా బైక్ కనిపిస్తే తమకు సమాచారం అందించాలని జుక్కల్ ఎస్సై నవీన్ చంద్ర తెలిపారు.

Leave a Reply