మానవత్వం చాటిన ఏఆర్ కానిస్టేబుల్..

మానవత్వం చాటిన ఏఆర్ కానిస్టేబుల్..
కాజీపేట, ఆంధ్ర ప్రభ : విధుల నిర్వహణతో పాటు సమాజ సేవలోనూ తాము ముందుంటామని ఓ ఏఆర్ (స్పెషల్ పార్టీ) కానిస్టేబుల్ నిరూపించారు. మండుటెండలో రోడ్డు దాటడానికి ఇబ్బంది పడుతున్న వృద్ధురాలికి సహాయం చేసి తన మానవత్వాన్ని చాటుకున్నారు.బుధవారం కాజీపేట ఫాతిమా జంక్షన్ వద్ద ఎండలో రోడ్డు దాటేందుకు ఓ అవ్వ ఇబ్బంది పడుతుండడంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ వృద్ధురాలను ను గమనించి వెంటనే అవ్వను రోడ్డు దాటించి, ఎక్కడికి వెళ్లాలని అడిగి ఆటోలో ఎక్కించి పంపించాడు. ఈ హృదయవంతమైన సహాయం చూసిన స్థానికులు కానిస్టేబుల్‌ను అభినందించారు.
