TG | చెట్టును ఢీకొన్న కారు….వ్య‌క్తి మృతి…

TG | చెట్టును ఢీకొన్న కారు….వ్య‌క్తి మృతి…

TG | ఉమ్మడి నల్లగొండ బ్యూరో, ఆంధ్రప్రభ : నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం చేపూరు ఎక్స్ రోడ్డు వద్ద ఈ రోజు జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. దేవరకొండ నుండి కారును అతివేగంగా నడుపుతూ నల్లగొండకు వెళ్తున్న సమయంలో కారు అదుపుతప్పి పక్కనే ఉన్న చెట్టుకు ఢీ కొట్టింది. దీంతో కారు నడుపుతున్న వ్యక్తి (36) కారు డ్రైవింగ్ సీట్లోనే ఇరుక్కొని మరణించాడు. మృతుడి వాహనంలో దొరికిన డ్రైవింగ్ లైసెన్స్ మీద వెంకటయ్య, పెద్దమునిగల్ గ్రామపంచాయతీ పరిధిలోని బచ్చాపురం గ్రామం అని ఉంది. కారు అతివేగంగా వెళ్లడం వల్లే అదుపుతప్పి చెట్టును ఢీకొని ఉంటుంది అని భావిస్తున్నారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply