మున్సిపల్ చైర్మన్ వార్డు సందర్శన

మున్సిపల్ చైర్మన్ వార్డు సందర్శన
ఆలేరు,ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని 6 వ వార్డును చైర్మన్ బీజన బాలమణి భాస్కర్ బుధవారం సందర్శించారు. వార్డును తిరుగుతూ పరిశీలన జరిపి సమస్యల పరిష్కారం కోసం నివేదికను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. వైస్ చైర్మన్ అంగడి ఆంజనేయులు, మున్సిపల్ కమీషనర్ కె శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ సిబ్బంది, వార్డు ప్రజలు పాల్గొన్నారు.
