TG | అధికారుల మౌనం వెనుక మర్మమేమిటి…?

TG | అధికారుల మౌనం వెనుక మర్మమేమిటి…?

  • భయమా శిక్షించలేని బంధమా…!

TG | పర్వతగిరి/వరంగల్ జిల్లా,ఆంధ్రప్రభప్రతినిధి : “తిలపాపం తల పిరికెడు” అన్న సామెతను మట్టి మాఫియా అక్షరాలా నిజం చేస్తోంది. ఊరి దేవుడి భూమిని సైతం వదలకుండా, పగలు రాత్రి తేడా లేకుండా యంత్రాలతో తవ్వేస్తూ కొండలను కరిగించేస్తున్నారు. పర్వతాల శివాలయ పరిసరాల్లో సాగుతున్న ఈ ‘మట్టి భాగోతం’ ఇప్పుడు స్థానికంగా పెను దుమారం రేపుతోంది.

TG

TG | ముడుపుల మత్తులో యంత్రాంగం..

ఈ అక్రమ దందాలో గ్రామ నేతల నుండి జిల్లా స్థాయి అధికారుల వరకు అందరికీ వాటాలు అందుతున్నాయనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఎవరైనా అడ్డుకుంటే “మాకు పైస్థాయి అండ ఉంది” అంటూ మాఫియా గర్జిస్తోంది. నియోజకవర్గ నేతల ఆశీస్సులు పుష్కలంగా ఉండటంతో, సంబంధిత శాఖల అధికారులు కనీసం ఆ దారి వైపు చూడటానికి కూడా భయపడుతున్నారా? లేక ముడుపుల మత్తులో జోగుతున్నారా? అని సామాన్య ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

TG

TG | మట్టి కోసమా…? గుప్త నిధుల వేట‌ నా…?

ఈ తవ్వకాలు చూస్తుంటే స్థానికుల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం మొరం (మట్టి) కోసమే ఇంత భారీగా తవ్వకాలు జరుగుతున్నాయా? లేక పర్వతాల శివాలయ పురాతన చరిత్రన

TG

CLICK HERE TO READ సింగరేణి ఓసీ- 2లో ప్రమాదం.. ఒకరు మృతి

CLICK HERE TO READ MORE

Leave a Reply