TG | ఉపాధి హామీ చట్టం నిర్విర్యానికి కుట్రలు….

TG | ఉపాధి హామీ చట్టం నిర్విర్యానికి కుట్రలు….

TG | బిక్కనూర్, ఆంధ్రప్రభ : ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుందని అఖిల భారత మహిళా కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మయూరిసింగ్ ఆరోపించారు. ఈ రోజు బిక్కనూరు మండల కేంద్రంలో వ్యవసాయ కూలీలను ఆమె కలిశారు. ఈ సందర్భంగా వారి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ఆరోపించారు.

ఉపాధి హామీ పథకంలో ఎలాంటి మార్పులు చేసినా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. అన్ని వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తుందని గుర్తు చేశారు. అట్టి పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు, ఉపాధ్యక్షురాలు లక్ష్మి, కామారెడ్డి జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు పాత జ్ఞానేశ్వరి రవి ప్రసాద్, మండల మహిళా విభాగం అధ్యక్షురాలు రేఖా సుదర్శన్ ,జిల్లా ఉపాధ్యక్షుడు కవిత మహిళలు ఉన్నారు.

Leave a Reply