మైనార్టీ రైతు వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్..

మైనార్టీ రైతు వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్..

టిఆర్ఎస్ నాయకుల విమర్శ

నాగర్ కర్నూల్, ఆంధ్రప్రభ : రాష్ట్ర బడ్జెట్ కేటాయింపులలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ మైనార్టీ బిసి రైతువర్గాలను మోసం చేసిందని , ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయకపోతే భవిష్యత్తులో ఉద్యమ కార్యాచరణ చేపడతామనినాగర్ కర్నూల్ నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ నాయకులు హెచ్చరించారు. ఆదివారం నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బడ్జెట్ కేటాయింపులపై మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై బడ్జెట్లో కేటాయింపులో అన్యాయం చేశారని విమర్శించారు. నాగర్ కర్నూల్ మాజీ జడ్పిటిసి శ్రీశైలం మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు .

కామారెడ్డి డిక్లరేషన్ బీసీలలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని రెండున్నర సంవత్సరాలలో అమలు కాలేదని ఆరోపించారు రిజర్వేషన్లలో 23 శాతం నుండి 17% కుదించారని సివిల్ కాంట్రాక్ట్స్ లో 42 శాతం ఇస్తామని ఇప్పటివరకు ఇవ్వలేదని అన్నారు ఓట్ల కోసం బీసీలను వాడుకుంటున్నారని గౌడ రజక విశ్వకర్మ తదితర కులాలకు హామీలు ఇచ్చి ఇప్పటివరకు అమలుపరచిన దాఖలాలు లేవని వారు ఆరోపించారు టిఆర్ఎస్ పార్టీ మైనార్టీ జిల్లా నాయకులు మాజీ సింగిల్ విండో చైర్మన్ తాడూరు మాట్లాడుతూ కాంగ్రెస్ మైనార్టీలకు ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కారని హామీలను విస్మరించారని విమర్శించారు ఇప్పటివరకు మైనార్టీ డిక్లరేషన్లు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని అబ్దుల్ కలాం విద్యా పథకాన్ని అమలు చేయలేదని ఇలా ఎన్నో హామీలు ఇచ్చి మైనార్టీలను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకున్న కాంగ్రెస్కు రాబోయే కాలంలో బుద్ధి చెప్తారని చెప్పారు.

నాగర్ కర్నూల్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ బడ్జెట్లో కమిషన్లు వచ్చే రంగాలకు మాత్రమే కేటాయింపు ఇచ్చారని, రైతు భరోసా ఇప్పటివరకు అమలు చేయలేదని ఇది రైతు ద్రోహ ప్రభుత్వమని విమర్శించారు. టిఆర్ఎస్వి రాష్ట్ర నాయకుడు విష్ణు సాగర్ మాట్లాడుతూ ఇచ్చిన హామీలను ప్రశ్నిస్తే కేసులు జైల్లోకి అరెస్టులు చేస్తున్నదని విమర్శించారు ఇది ఎంతో కాలం సాగదని రెండున్నర సంవత్సరాలు హామీలు అమలు చేస్తారని సమయం టిఆర్ఎస్ పార్టీ ఇచ్చిందని ఇదేవిధంగా కొనసాగితే రాబోయే కాలంలో విద్యార్థి యువజనలను సమీకరించి పోరాట కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు.

తిమ్మాజిపేట టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ప్రదీప్ మాట్లాడుతూ దళిత బంధు 12 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పటికీ అమలు చేయలేదని అన్నారు . దళితులకు ఇచ్చిన హామీలను విస్మరించారని ఆయన ఆరోపించారు .ఈ విలేకరుల సమావేశం లో మాజీ మార్కెట్ చైర్మన్ వెంకటయ్య ,మాజీ సింగిల్ విండో చైర్మన్ కౌన్సిలర్ తిమాజిపేట పాండు, కౌన్సిలర్లు జేపీ చారి గంగాధర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బాబురావు మైనార్టీ నాయకులు షఫీ టిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఐతోలులక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు

Leave a Reply