TG | దాతలు ముందుకు వస్తే సమస్యలు పరిష్కారం..

TG | బిక్కనూర్, ఆంధ్రప్రభ : దాతలు ముందుకు వస్తే ఎంతటి సమస్య అయినా పరిష్కారం అవుతుందని బిక్కనూర్ మండల విద్యాశాఖ అధికారి రాజగంగారెడ్డి అన్నారు. ఈ రోజు మండలంలోని పెద్ద మల్లారెడ్డి గ్రామంలో రూ. 2 లక్షల వ్యయంతో నిర్మించిన వేదికను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… అదే పాఠశాలలో తెలుగు అధ్యాపకురాలుగా పనిచేస్తున్న మంగ ఆమె సోదరీ శ్రీలతలు వేదిక నిర్మాణానికి రెండు లక్షల రూపాయలు ఖర్చు చేయడం ఎంతో అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా వారిని ఆయన అభినందించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు వారు తీసుకున్న నిర్ణయం ఎంతో గొప్ప విషయమని చెప్పారు. సరస్వతి దేవి ఆశీస్సులు వారి కుటుంబానికి ఎల్లవేళలా ఉంటాయన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ప్రసున్న దేవి, గ్రామ సర్పంచి కోడూరి సాయ గౌడ్, ఉప సర్పంచ్ చైతన్య రెడ్డి, సొసైటీ మాజీ అధ్యక్షులు రాజా గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాగా రెడ్డి, వార్డు సభ్యులు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
