ఆయిల్ ఫామ్ సాగు పంటపై రైతులకు అవగాహన..

ఆయిల్ ఫామ్ సాగు పంటపై రైతులకు అవగాహన..
గట్టుప్పల, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా గట్టుప్పల మండల కేంద్రంలోని రైతువేదికలో బుధవారం ఆయిల్ ఫామ్ సాగు పంటపై ఆత్మ వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆద్వర్యంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.శిక్షణకు విచ్చేసిన రైతులను ఉద్దేశించి మునుగోడు ఏ డి ఏ వేణుగోపాల్ మరియు హార్టికల్చర్ అధికారి విద్యాసాగర్ ఆయిల్ పామ్ పంట సాగు చేసే విదానం,అనువైన నేలలు, మార్కెటింగ్ మరియు పంట సాగువలన కలిగే లాభాలను వివరించారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారిణి యం రేవతి,ఏవోలు జి రాకేష్,కార్తీక్,ఉపసర్పంచ్ ఖమ్మం లక్ష్మయ్య,పోరెడ్డి ముత్తిరెడ్డి, ఘాసిరాం,లింగయ్య తదితరులు పాల్గొన్నారు.
