చెత్తాచెదారంతో నిండిపోయిన శివనగర్ డ్రైనేజీ..

చెత్తాచెదారంతో నిండిపోయిన శివనగర్ డ్రైనేజీ..
దుర్వాసన దోమలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు
వర్షాలు పడుతున్నాయి తక్షణమే స్పందించండి
కరిమాబాద్, ఆంధ్రప్రభ : గ్రేటర్ వరంగల్ 34 డివిజన్ శివానగర్లోని డ్రైనేజీ చెత్తాచెదారంతో నిండిపోయి తీవ్ర దుర్వాసన వెదజల్లుతున్నదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డివిజన్లోని పండ్ల సారంగపాణి ఇంటి సమీపంలోని బాక్స్ డ్రైనేజీ దీనిని పెద్దకాలుగా అని కూడా అంటారు చెత్త అంత పేరుకుపోయి దోమలతోటి ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడి ప్రజలు ఈ బాక్స్ డ్రైనేజీ స్మార్ట్ సిటీ కాంట్రాక్టు ఎం ఐ హెచ్ కాంట్రాక్టర్ఈ బాక్స్ డ్రైనేజీని ప్రారంభం చేసి కొంత పని చేసి మధ్యలో వదిలిపెట్టి వెళ్లిపోవడం జరిగినదనీ స్థానికులు తెలిపారు. దీంతో సమస్య మరింత ఇబ్బందికరంగా మారింది. వరుసగా నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. వర్షాలు కూడా పడుతున్నాయి. శివనగర్ మైసయ్య నగర్ ఈ ప్రాంతం ముంపు ప్రాంతం గతంలో చాలాసార్లు అధికారులకు తెలియజేయడం జరిగినదని ఎవరు స్పందించడం లేదనీ స్థానికులు తెలిపారు. ప్రజా సంక్షేమం దృష్ట్యా నగర మేయర్, కమిషనర్ స్పందించి డ్రైనేజీ లోని చెత్తాచెదారం తొలగించేందుకు అధికారులను ఆదేశించాల్సిందిగా స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
