బస్సుల నుంచి బ్యాటరీలు దొంగిలించిన నిందితుడు..

బస్సుల నుంచి బ్యాటరీలు దొంగిలించిన నిందితుడు..
నర్సంపేట,క్రైం, ఆంధ్రప్రభ : వరంగల్ రోడ్‌లో నీలిపి ఉన్న హైర్ బస్సుల నుంచి బ్యాటరీలు దొంగిలించిన దొంగను పోలీసులు ఈ రోజు ఉదయం పట్టుకున్నారు.నర్సంపేట శివారుల్లో వాహన తనిఖీలు చేస్తుండగా ఈ ఘటన జరిగింది.కత్తెరపల్లి చందు, ఇటుకలపల్లి, ప్రస్తుత నివాసం: శాంతినగర్ అనే వ్యక్తి నలభాగాల బ్యాటరీలను ఆటోలో తరలిస్తుండగా పోలీసులు పట్టుకుని విచారించారు. విచారణలో ఆయన ఇటీవల హైర్డ్ ఆర్టీసీ బస్సుల నుంచి బ్యాటరీలు దొంగిలించినట్టు ఒప్పుకున్నాడు. దొబ్బిన బ్యాటరీల విలువ సుమారు 60,000రూపాయలు. పోలీసులు పట్టుకున్న బ్యాటరీలు, ఆటోను స్వాధీనంలోకి పెట్టుకుని, నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.
