జగద్గురును దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే షిండే..

జగద్గురును దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే షిండే..

జుక్కల్, ఆంధ్రప్రభ : జుక్కల్ మండలంలోని దోస్ పల్లి- బంగారుపల్లి వద్దగాల శ్రీ జగద్గురువు రామనందా చార్య నరేంద్రాచర్యాజి సంస్థాన్ తెలంగాణ ఉపపీఠంలో సమస్యమార్గదర్శనం-దర్శన భాగ్యం కార్యక్రమం మొదటిరోజు మంగళవారం జగద్గురు శ్రీ నరేంద్రాచార్యజి భక్తులకు దర్శనమివ్వటమే కాకుండా సమస్య మార్గదర్శనం కార్యక్రమం కూడా కొనసాగుతుండటంతో భక్తులైన జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే,శ్రీ జగద్గురు రామానందచర్య నరేంద్రచార్యజి ని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా జగద్గురు వారికి ఆశీర్వచనాలతో పాటు తీర్థప్రసాదాలను అందించి ఆశీర్వదించారు.మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే మాట్లాడుతూ తెలంగాణ ఉపపీఠం ద్వారా ప్రతి మూడు నెలలకు ఒకసారి జగద్గురువుల వారు ఆధ్యాత్మిక,భక్తి కార్యక్రమాలు నిర్వహించటం,దర్శన భాగ్యం కల్పించటం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు.ఈ సందర్భంగా తెలంగాణ ఉప పీఠం ప్రముఖులు మాజీ మాజీ ఎమ్మెల్యే షిండేను శాలువా పుష్ప గుచ్ఛం తో సత్కరించరు.బిఆర్ఎస్ నాయకులు సైతం జగద్గురు దర్శించుకున్నారు.

Leave a Reply