గుడి పరిసరాల శుభ్రతకు చర్యలు..

గుడి పరిసరాల శుభ్రతకు చర్యలు..

మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్ పరిశీలన

భూపాలపల్లి , ఆంధ్రప్రభ : ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా భూపాలపల్లి మున్సిపాలిటీలోని 26వ వార్డులో శుక్రవారం పోచమ్మ గుడి పరిసరాల శుభ్రతకు చర్యలు చేపట్టారు. 26వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ ఓరగంటి రాధ–ఐలయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. పోచమ్మ గుడిలో భక్తులు బోనాలు సమర్పించేందుకు వచ్చే సమయంలో ఆలయ పరిసరాల్లో కొట్టిపడిన చెట్లు, చెదారం అడ్డంకిగా మారిన నేపథ్యంలో వాటిని తొలగించి ప్రదేశాన్ని చదును చేయాలని కౌన్సిలర్ మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్‌ను కోరారు. దీనిపై స్పందించిన కమిషనర్ అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించి ఆలయ కమిటీ సభ్యుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం సింగరేణి ద్వారా ట్రాక్టర్ కేటాయించి చెట్లు, చెదారాన్ని తొలగించి పరిసరాలను శుభ్రపరిచే చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో పోచమ్మ గుడి కమిటీ అధ్యక్షుడు గౌరీ కృష్ణ, సభ్యులు వంగపల్లి రాజయ్య, చంద్రయ్య, సూరా రాజేష్ తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply