గ్రామాలను ఆదర్శ వంతంగా తీర్చిదిద్దుతాం..

గ్రామాలను ఆదర్శ వంతంగా తీర్చిదిద్దుతాం..
పౌర సేవలను సమర్ధవంతంగా అందిస్తాం
నర్సంపేట, ఆంధ్రప్రభ : నర్సంపేట మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీ లక్ష్మీ రామానంద్ పేర్కొన్నారు. విలీన గ్రామమైన మగ్దంపురం 11వ వార్డును మున్సిపల్ అధికారులతో పాటు స్థానిక కౌన్సిలర్ చీకటి స్వరూపలు పలు వీధులను పరిశీలించారు. గ్రామంలోని డంపింగ్ యార్డ్, బతుకమ్మ ఆడుటస్థలం, పల్లె దవాఖాన,మట్టి రోడ్లును, డ్రైనేజ్ వ్యవస్థను పరిశీలించారు.విలీనమైన గ్రామ ప్రజల ఫిర్యాదులను పరిష్కరించేందుకు పౌర సేవలను సమర్థవంతంగా అందించేందుకు మున్సిపల్ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందిస్తామని, పారిశుధ్యం పట్ల ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేస్తామన్నారు.
