ప్లాస్టిక్ రహిత గ్రామంగ చేయడమే లక్ష్యం..

ప్లాస్టిక్ రహిత గ్రామంగ చేయడమే లక్ష్యం..

చిట్యాల, ఆంధ్రప్రభ : చిన్న కాపర్తి గ్రామాన్ని ప్లాస్టిక్ రహిత గ్రామంగా చేయడమే తమ లక్ష్యం అని మహిళా సంఘాల జిల్లా సంఘం అధ్యక్షురాలు ఆవుల మాధవి తెలిపారు నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలో గ్రామ సర్పంచ్ ఆవుల సుందర్ జిల్లా మహిళా సంఘం అధ్యక్షురాలు ఆవుల మాధవి ప్రజలకు అవగాహన కల్పిస్తూ గ్రామంలో ర్యాలీ నిర్వహించి ప్లాస్టిక్ నిషేధించాలని కోరుతూ గ్రామంలో ఉన్న చిరు వ్యాపారస్తులకు నోటీసులు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం పిలుపుమేరకు 99 రోజుల ప్రణాళిక లో భాగంగా నేడు గ్రామంలో ప్లాస్టిక్ నిషేధం పై ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందని వారు పేర్కొన్నారు ఈ ప్లాస్టిక్ వాడకం ద్వారా వాతావరణం లో రాబోయే తీవ్ర పరిణామాలు ప్రతి ఒక్కరు ముందు తరాలకు మంచి వాతావరణం కల్పించే బాధ్యత మనందరిపై ఉన్నదని వారు అన్నారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఉప సర్పంచ్ బెల్లంకొండ లావణ్య రఘు వార్డు సభ్యులు గ్రామ ప్రజలు తదితరు పాల్గొన్నారు

Leave a Reply