సృష్టికి మూలం మహిళ..

సృష్టికి మూలం మహిళ..
ముధోల్ సర్పంచ్ షబానా ఎజాజ్ ఉద్దీన్
ముధోల్, ఆంధ్రప్రభ : సృష్టికి మూలం మహిళ అని ముధోల్ సర్పంచ్ షబానా ఎజాజ్ ఉద్దీన్ అన్నారు. మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ షబానా ఎజాజ్ ఉద్దీన్ ఆధ్వర్యంలో పారిశుద్ధ, ఐకేపీ శాఖలకు చెందిన మహిళలను గౌరవంగా అభినందిస్తూ శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ సృష్టికి మూలం మహిళ అని తెలియజేశారు. భారతదేశంలో మహిళను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యతని అన్నారు. అనంతరం మహిళా దినోత్సవ సందర్భంగా ఐకెపి, కార్యకర్తలను స్వీట్లు తినిపించి ఘనంగా మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ కోరి లావణ్య సాయినాథ్, ఈవో అన్వర్ అలీ, ఏపిఎం గురుచరణ్, వార్డ్ సభ్యులు నర్మదా గంగాధర్, రేణుకసాయినాథ్, మహమ్మద్ అబ్దుల్ ఖాళీక్, జామిల్,తోపాటు ఐకేపీ సిబ్బంది పారిశుద్ధ కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.
