డైరీ ఫార్ములా సందర్శించిన నీతి అయోగ్ బృందం

డైరీ ఫార్ములా సందర్శించిన నీతి అయోగ్ బృందం

బూర్గంపహాడ్, ఆంధ్రప్రభ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామంలో గేదెల డైరీ ఫామ్ ను శుక్రవారం కేంద్ర నీతి అయోగ్ కన్సల్టెంట్ , ఉమాంగ్ కటోచ్. అసిస్టెంట్ కన్సల్టెంట్ నవనీత్ బృందం సందర్శించారు.డైరీ ఫామ్ లో గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం ప్రారంభించారు. రైతులతో పశువుల పెంపకంలో పాటిస్తున్న ప్రమాణాలు వాటికి అందుతున్న వ్యాధినివారణ టీకాల కార్యక్రమం గురించి, క్షేత్రస్థాయిలో అందుతున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు. బ్రెడబుల్ పాపులేషన్ అభివృద్ధి కొరకు కృత్రిమ గర్భాధరణ చేయు విధానము రైతులకు సర్వీసు చేసే విధానము గురించి డాక్టర్ రాజేంద్ర అడిగిన ప్రశ్నలకు అన్ని విషయాలు వివరంగా చెబుతూ ఇప్పుడు కృత్రిమ గర్భాధరణలో ఆడ దూడల వాడుతున్నామని వివరించారు .ఈ కార్యక్రమంలో మండల పశు వైద్య సిబ్బంది,గణేష్ టి. గోవిందరెడ్డి, కిరణ్ పాల్గొన్నారు.

Leave a Reply