గిరిజన కుటుంబాలకు గ్యాస్ సిలిండర్ల పంపిణీ

గిరిజన కుటుంబాలకు గ్యాస్ సిలిండర్ల పంపిణీ
అడవిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత
అటవీ క్షేత్ర అధికారి శ్రీనివాస్
తిర్యాణి , ఆంధ్రప్రభ : మండలంలోని ఏదులపాడు గ్రామ పంచాయతీలో అడవి శాఖ ఆధ్వర్యంలో గిరిజన కుటుంబాలకు గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేశారు. అడవి ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఎక్కువగా వంట కోసం కట్టెలపై ఆధారపడటం వల్ల అడవులకు నష్టం జరుగుతోందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో గిరిజన కుటుంబాలు కట్టెలపై ఆధారపడకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఏదులపాడు గ్రామంలో అడవి శాఖ తరఫున మొత్తం 20 కుటుంబాలకు గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎఫ్ఆర్ఓ శ్రీనివాస్ మాట్లాడుతూ అడవి ప్రాంతాల్లో నివసించే ప్రజలకు వంట కోసం సౌకర్యం కల్పించడం తో పాటు అడవులను సంరక్షించడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గిరిజనులు కట్టెల కోసం అడవిలోకి వెళ్లే అవసరం తగ్గి పర్యావరణ పరిరక్షణకు కూడా ఇది ఎంతగానో దోహదపడుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎఫ్‌పి ఓ–2 శ్రీనివాస్, జి. నరేష్, సి.హెచ్. మనోహర్, జి. శ్రీలేఖ (ఎఫ్‌బీఓ), గ్రామ సర్పంచ్ పార్వతి అంబారావు, పంచాయతీ కార్యదర్శి, అశోక్, మోతీరాం పటేల్, గ్రామ పెద్దలు మరియు స్థానికులు పాల్గొన్నారు.
