బెల్లం,పట్టిక పట్టుకున్న ఎక్సైజ్ శాఖ అధికారులు

బెల్లం,పట్టిక పట్టుకున్న ఎక్సైజ్ శాఖ అధికారులు
300కేజీల పట్టిక 100కేజీల బెల్లం పట్టివేత : ఎక్సైజ్ సీఐ నరేష్ రెడ్డి
నర్సంపేట, ఆంధ్రప్రభ : నర్సంపేట మున్సిపాల్టీ పరిధిలోనీ ముత్తోజిపేట లో వాహనాలను తనిఖీ చేస్తుండగా 300 కిలోల పట్టిక,100 కిలోల బెల్లం,5 లీటర్ల నాటు సారాను పట్టుకున్నట్లు నర్సంపేట ఎక్సైజ్ సీఐ నరేష్ రెడ్డి తెలిపారు.వరంగల్ డివిజన్ డిప్యూటీ కమిషనర్ అంజన్ రావు మరియు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి అరుణ్ కుమార్ ఆదేశాల మేరకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ నర్సంపేట పరిధిలో నాటుసారా నియంత్రణ కొరకు ప్రత్యేక కార్యాచరణ కార్యక్రమాన్ని రూపొందించి అందులో భాగంగా విస్తృత తనిఖీలను చేపట్టడం జరిగిందన్నారు. తనిఖీలో భాగంగా నాటుసారా తయారీకి ఉపయోగించే ముడి పదార్థాల రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ముడి పదార్థాల రవాణా చేస్తున్నారని ఖచ్చితమైన సమాచారం తో నర్సంపేట మున్సిపాలిటీ ముత్తోజి పేట వద్ద వాహన తనిఖీలు నిర్వహించగా నల్లబెల్లి మండలం బుచ్చిరెడ్డి పల్లెకు చెందిన బానోతు రాజన్న ఏలి యాస్ టీక్య అనే వ్యక్తి బెల్లం, పట్టిక ను కారులో రవాణా చేస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు.
కారును తనిఖీ చేయగా 300 కేజీల పట్టిక , 100 కేజీల బెల్లం, ఐదు లీటర్ల నాటుసార, టాటా విస్టా కారు, ఒక మొబైల్ ఫోన్ సీజ్ చేయడం జరిగిందన్నారు. ఈ తనిఖీలలో నర్సంపేట ఎక్సైజ్ నరేష్ రెడ్డి ఎస్సై శార్వాణి సిబ్బంది పాల్గొన్నట్లు తెలిపారు.
