అగ్రజాపల్లిలో ప్రత్యేక వైద్య సేవలు

అగ్రజాపల్లిలో ప్రత్యేక వైద్య సేవలు

చెన్నూర్ ఆంధ్రప్రభ : చెన్నూరు మండలం అగ్రజాపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇవ్వాళ ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక లో భాగంగా మంచిర్యాల జిల్లా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ని 7 రకాల ప్రత్యేక డాక్టర్ లు రోగులకు వైద్య పరీక్షలు నిర్వహింరు. ఆరోగ్య పరిస్థితులను పరిశీలించి సరిపడ మందులను అందజేసి ఎవరికైతే ఆధునిక వైద్యం అందించ అవసరం ఉందో వారిని మంచిర్యాలకు రిఫర్ చేసి పంపించారు.
జిల్లాలోని అన్ని ప్రథమ చికిత్స కేంద్రాలలో ఇదే మాదిరిగా క్యాంపులు ఏర్పాటు చేయడం జరుగుతుందని ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగపరుచుకోవాలని వైద్య అధికారులు కోరారు.

Leave a Reply