కోటంచ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి…..

కోటంచ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి…..
రేగొండ, ఆంధ్రప్రభ : మరో యాదాద్రిగా పిలువబడే స్వయంభూ నరసింహుడిగా ప్రసిద్ధి గాంచిన కోటంచ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయాన్ని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చందుపట్ల కీర్తి రెడ్డి శుక్రవారం దర్శించుకున్నారు.ఆలయానికి చేరుకొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, పూలు పండ్లు నైవేద్యాలు సమర్పించి స్వామివారి ఆశీస్సులు పొందారు. దేశం అభివృద్ధి చెందాలని, రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో జీవించాలని స్వామివారిని ప్రార్థించారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు ఏడునూతుల నిషిధర్ రెడ్డి కూడా దేవాలయాన్ని దర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అలయ అర్చకులు కీర్తిరెడ్డికి స్వామి వారి శేషా వస్త్రాలతో సత్కరించారు. ఆలయ ప్రాంగణంలో భక్తులతో కీర్తి రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు. బండి శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి పెండల రాజు, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు పోలుసాని తిరుపతి రావు, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు. సయ్యద్ గాలీఫ్, వార్డు సభ్యులు. ఎరబాటి శివ, దేవేందర్, సోషల్ మీడియా కన్వీనర్. ఎర్ర రాకేష్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు భక్తులు పాల్గొని స్వామివారి దర్శనం అనంతరం నాయకులు ఆలయ విశిష్టత గురించి తెలుసుకున్నారు.
