సొంత ఇంటి కల కాంగ్రెస్ తోనే సాధ్యం..

సొంత ఇంటి కల కాంగ్రెస్ తోనే సాధ్యం..

బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ముత్యాల సునీల్ కుమార్

కమ్మర్ పల్లి, ఆంధ్ర ప్రభ : నిరుపేదల సొంత ఇంటి కల కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అవుతుందని కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గం ఇన్చార్జి ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం కమ్మర్ పల్లి మండల కేంద్రంలో కలూరి సంద్య మహేందర్ నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ద్వారా వారి సొంతింటి కల నేరవేరినందుకు వారి కుటుంబం ఆనందంగా ఉంది,వారికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని బహూకరించి వారి సంతోషంలొ భాగస్వామ్యం కావడం పట్ల సంతోషంగా ఉందని అన్నారు. అర్హత కలిగిన పేదవారికి ఇందిరమ్మ ఇల్లు ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుంకేట రవి,వైస్ చైర్మన్ సుంకేట బుచ్చన్న, నిమ్మ రాజేంద్రప్రసాద్,బుచ్చి మల్లయ్య, అజ్మత్ పాషా, అబ్దుల్ అజహారోద్దిన్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply