ఏ ఈ పై ఆరోపణలు..

ఏ ఈ పై ఆరోపణలు..
నెర్రెలు భారిన పొలం
చెరువు వద్ద ఆందోళన చేస్తున్న రైతులు
బయ్యారం పెద్ద చెరువు వద్ద రైతుల ఆందోళన
నీరు విడుదల చేయడం లేదంటూ
బయ్యారం, ఆంధ్ర ప్రభ : పొలాలు ఎండిపోతున్న కావలసిన నీరును విడుదల చేయడంలో నీటిపారుదల శాఖ ఇంజనీర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ పంటలు ఎండిపోవటానికి కారణమవుతున్నదంటూ రైతులు బయ్యారం పెద్ద చెరువు తూము వద్ద ఆందోళనకు దిగారు. ఈ సంవత్సరం రభి సీసన్ కు గాను బయ్యారం పెద్ద చెరువు కింద 1500 ఎకరాలకు సాగు నీరందించడానికి సంబంధిత శాఖ నిర్ణయించింది. ఈ నిర్ణయం లో ఇర్సులాపురం సమీపంలోని ఈసం లక్ష్మయ్య బుర్ర కింద ఉన్న సుమారు వంద ఎకరాలను కూడా కేటాయించారు.అయితే ఆనాడే రైతులు చివరి బుర్రకు నీరందడానికి ఇబ్బందులు ఏర్పడతాయి ఈ కాలువను మినహాయించండి పై బుర్ర వరకే నీళ్లు ఇవ్వండని అధికారులకు తేల్చి చెప్పిన అధికారులు పట్టించుకోకుండా నీరు సరిపోతుంది మేము కావాల్సిన నీరు అందిస్తామని ఆనాడు రైతులకు నమ్మబలకడం తో రైతులు నాట్లు వేశారు.

ఈ బుర్ర కింద ఉన్న వారంతా ఒకరిద్దరు మినహా అందరూ గిరిజన రైతులె.నాటువేసి నెల రోజులు కావస్తున్న కనీసం ఐదు ఎకరాల కూడా నీరు అందలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గత కొద్దిరోజులుగా సంబంధిత ఏ ఈ కి నీటిని మరింత వదలండి నీరు అందడం లేదని మొరపెట్టుకున్నప్పటికీ ఇదిగో అదిగో అంటూ మూడు రోజులగా కాలయాపన చేస్తూ వస్తుందని రైతులు ఆరోపిస్తున్నారు. ఇది ఇలావుండగా చెర్వు సమీప గ్రామానికి చెందిన కొందరు రైతులు అనుమతులు లేకుండా సుమార 100 ఎకరాలవరకు సాగుచేసారని ఆ భూములను కూడా అధికారి నీరంధిస్తుందని రైతులు ఆరోపిస్తున్నారు. వదిలే నీటినికుడా సంబధిత సిబ్బంది నియత్రించడం లేదని విమర్శిస్తున్నారు. చెరువులో సమృద్ధిగా నీరున్నా అధికారి సరిపడా నీరు వదలకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందంటు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎండిపోతున్న పంటను చూసి తట్టుకోలేని రైతులు శుక్రవారం బయ్యారం చెరువు వద్దకు చేరి కత్తి అశోక్ నాయత్వంలోఆందోళనకు దిగారు.
