రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి..

రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి..
జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ముట్టడి
విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నవాతే ప్రతాప్.
నిజామాబాద్ అర్బన్, ఆంధ్రప్రభ : జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాజ్యసభ సభ్యులు ఎంపీ ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి, కళాశాలల బైకడ్.ఈ సందర్భంగా నిజామాబాద్ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నవాతే ప్రతాప్ ఆధ్వర్యంలో గిరిరాజ్ కళాశాల బైకడ్ చేయడం జరిగింది.నావాతే ప్రతాప్ మాట్లాడుతూ….నిజామాబాద్ జిల్లాలో అన్ని కళాశాలలో స్వచ్ఛందంగా బందు నిర్వహించారు అంతేకాకుండా కొన్ని కళాశాలలను మేము బంద్ చేసాము కొన్ని కళాశాలలు స్వచ్ఛందంగా బందు చేయడానికి గల కారణం, నిజామాబాద్ జిల్లాలో సుమారు 300 కోట్ల రూపాయలు స్కాలర్షిప్లు బకాయిలు ఉన్నాయి రాష్ట్రవ్యాప్తంగా 6000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి.
ఈ యొక్క స్కాలర్షిప్లు ఇవ్వమని యాజమాన్యాలు అడిగితే విజిలెన్స్ అధికారుల పేరుతోనే కళాశాల యాజమాన్యాలను బ్లాక్ మెయిల్ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామని,ఈసందర్భంగా తెలియజేయడం జరిగింది.పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు విడుదల చేయకపోతే రానున్న రోజుల్లో జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి సరైన సమాధానం చెబుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు దాత్రిక రాజు,జనార్ధన్,రాకేష్,నరేష్, నగర యూత్ అధ్యక్షులు సాయి, అవధుత్ ప్రసాద్,వెంకట్,నవీన్ తదితరులు పాల్గొన్నారు.
