తెలంగాణలో బీజేపీ అధికారమే లక్ష్యం..

తెలంగాణలో బీజేపీ అధికారమే లక్ష్యం..

నార్సింగి, ఆంధ్రప్రభ : Eatala Rajender నిజామాబాద్‌కు వెళ్తున్న క్రమంలో నార్సింగి మండల కేంద్రంలో బీజేపీ కార్యకర్తలను కలిశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ శాలిపేట్ బ్రిడ్జి నిర్మాణంతో పాటు మట్టి రోడ్డును బీటీ రోడ్డుగా త్వరితగతిన నిర్మించాలని ఆయన దృష్టికి తీసుకెళ్లగా, దీనిపై ఈటల రాజేందర్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఈటల రాజేందర్ ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను మరిచిపోయిందని, బీఆర్‌ఎస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే కొనసాగుతున్నాయని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.

కార్యకర్తలు ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని, ప్రజల్లోకి వెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. 2028 నాటికి తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడం లక్ష్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు యెన్నం లింగారెడ్డి, పట్టణ అధ్యక్షుడు మైలారం నర్సింలు, మాజీ వార్డు సభ్యులు దాయం నరేష్, మన్నే యాదగిరి, అంబటి శ్రీనివాస్, నరేష్ నాయక్, సాయి కుమార్, వినోద్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply