ఆనందోత్సాహాల మధ్య హోలీ సంబురాలు..

ఆనందోత్సాహాల మధ్య హోలీ సంబురాలు..

మక్తల్ లో హోలీ వేడుకల్లో యువత

మక్తల్ , ఆంధ్రప్రభ : రంగుల కేళి హోలీ సంబురాలు ఘనంగా జరుపుకున్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో బుధవారం హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. యువకులు, పిల్లలు, పెద్దలు గుంపులు,గుంపులుగా చేరి రంగులు చల్లుకుంటూ హోలీ వేడుకలను జరుపుకున్నారు. ఒకరిపై ఒకరు రంగుల చల్లుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఘనంగా వేడుకలు జరుపుకున్నారు .బ్యాండ్ మేళాలతో ఆనందోత్సవాలతో మునిగితేలారు .చెడ్డి గ్యాంగ్,జిజెసి ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో మిత్రబృందాలు భారీ ఎత్తున వేడుకలను జరుపుకున్నారు.బైక్ లపై బయలుదేరి పట్టణ ప్రధాన రహదారుల వెంబడి ర్యాలీ నిర్వహించారు.

ఒకరిపై ఒకరు రంగుల జల్లుకుంటూ ఇతరులపై రంగులను చల్లి హోలీ శుభాకాంక్షలు కూడా ఇవాళ హోలీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో చెడ్డి గ్యాంగ్, జిజేసి మిత్ర బృందం సభ్యులు మాజీ ఎంపీటీసీ,బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి జి.బలరాం రెడ్డి,డిప్యూటీ తాహశీల్దార్ బి.సురేష్,ఆర్ఐ మదన్మోహన్ రెడ్డి, బి .శ్రీనివాసులు, బి.రఘునాథ్ రెడ్డి,వీరేశ్ రెడ్డి,భూపాల్ రెడ్డి, మంజు రాజశేఖర్, సి.కృష్ణ, డాక్టర్ శ్రీరామ్,మాజీ ఉప సర్పంచ్ కాంగ్రెస్ నాయకులు కట్ట సురేష్ కుమార్ గుప్తా,రుమాళ్ళ రాజశేఖర్,అనుగొండ జగదీష్, బి .ఆంజనేయులు సూర్య, తిరుపతి, చీరాల సత్యనారాయణ , తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply