రాంసాగర్ గ్రామంలో దోమల బెడద..

రాంసాగర్ గ్రామంలో దోమల బెడద..
దోమల నివారణకు రాంసాగర్‌లో ఫాగింగ్
రాయపోల్, ఆంధ్రప్రభ : రాయపోల్ మండలం రాంసాగర్ గ్రామంలో దోమల బెడద పెరుగుతున్న నేపథ్యంలో గ్రామ సర్పంచ్ నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి ఫాగింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన వీధులు,గల్లీలు, కాలనీల్లో ప్రత్యేక ఫాగింగ్ యంత్రాలతో దోమల నివారణ చర్యలు చేపట్టారు.
ఈ సందర్భంగా సర్పంచ్ నరేష్ గౌడ్ మాట్లాడుతూ గ్రామ ప్రజలు తమ ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఎక్కడైనా నిల్వ నీరు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.దోమల వల్ల డెంగీ,మలేరియా వంటి వ్యాధులు వ్యాపించే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తగా ఫాగింగ్ చేపట్టినట్లు తెలిపారు. గ్రామస్తులు ఈ చర్యపై సంతోషం వ్యక్తం చేస్తూ, గ్రామ ప్రజల ఆరోగ్యం కోసం చర్యలు తీసుకుంటున్న సర్పంచ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
