TG | ధర్మపురి లో బిజెపి, బిఆర్ఎస్ పార్టీలకు బిగ్ షాక్

TG | ధర్మపురి లో బిజెపి, బిఆర్ఎస్ పార్టీలకు బిగ్ షాక్
TG | ధర్మపురి, ఆంధ్రప్రభ : జగిత్యాల జిల్లా ధర్మపురి లో బిజెపి, బిఆర్ఎస్ కు బారి షాక్ తో ధర్మపురి లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ,బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆదివారం కాంగ్రెస్ పార్టీ లో చేరారు.బిజెపి ఎస్సీ మోర్చా జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి దొనకొండ నరేష్‌తో పాటు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ధర్మపురి ట్రాక్టర్ యూనియన్ అధ్యక్షులు లశెట్టి మహేష్‌లు తమ పార్టీలకు గుడ్‌బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ధర్మపురి క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమ విధానాలు, నాయకత్వంపై నమ్మకంతోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు కొత్తగా చేరిన నాయకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంఘనబట్ల దినేష్,నాయకులు సౌళ్ల నరేష్,అప్పం తిరుపతి, తదితరులు పాల్గొన్నారు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు*
