TG | యునైటెడ్ పాఠశాలలో అలరించిన సైన్స్ ఫెయిర్

TG | యునైటెడ్ పాఠశాలలో అలరించిన సైన్స్ ఫెయిర్
TG | కరీంనగర్, ఆంధ్రప్రభ : కరీంనగర్ లోని యునైటెడ్ స్కూల్లో సైన్స్ ఫెయిర్ వేడుకలు అలరించాయి. ఆదివారం పాఠశాలలో యునైటెడ్ ఎడ్యుకేషనల్ ఎక్స్పో 2026 పేరుతో నిర్వహించిన సైన్స్ ఫెయిర్ వేడుకలు చూపరులను ఆలోచింపచేసాయి. విద్యార్థులు వివిధ రూపాలలో ఏర్పాటుచేసిన ఎగ్జిబిట్లు చూపరులను ఆకట్టుకున్నాయి. వేడుకలను కరస్పాండెంట్ ఖాజా సజియుద్దీన్, ప్రిన్సిపాల్ ముజాహిద్దీన్ ఉపాధ్యాయులు వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు సైన్స్ ఫెయిర్ వేడుకలు దోహదపడతాయని తెలిపారు. విద్యార్థులకు చిన్నతనం నుంచే వివిధ అంశాలపై ఆలోచింప చేయాలనే ఉద్దేశంతో సైన్స్ ఫెయిర్ వేడుకలను నిర్వహించినట్లు తెలిపారు. వేడుకల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనడం అభినందనీయం. అనంతరం విద్యార్థులు చేసిన ఎగ్జిబిట్లను చూసి అభినందించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
