TG | కండ్లలో కారంపొడి చల్లి..

TG | కండ్లలో కారంపొడి చల్లి..

మహిళ మెడలోని బంగారం చోరీ..
2 తులాల పుస్తెలతాడు లాక్కెళ్లిన దొంగ

TG | జన్నారం, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని తపాల్ పూర్ కు చెందిన రామటెంకి లావణ్య కండ్లలో కారంపొడి చల్లి,కొట్టి మెడలో నుంచి రెండు తులాల బంగారపు పుస్తెలతాడును శుక్రవారం తెల్లవారుజామున గుర్తుతెలియని ఓ దొంగ లాక్కెళ్లాడని స్థానిక ఎస్సై గొల్లపల్లి అనూష సాయంత్రం తెలిపారు. లావణ్య భర్త రాజన్న కూతురు ఆరాధ్యతో కలిసి గురువారం రాత్రి భోజనం చేసి ఇంట్లో పడుకొని ఉండగా, తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో ఇంటి ముందు రేకులు కొట్టినట్టు శబ్దం వినిపించగానే పక్షవాతంతో ఉన్న భర్త రాజన్నను లావణ్య లేపి వెళ్లి తలుపులు తీయగానే ముఖానికి మాస్క్ ధరించి ఉన్న గుర్తు తెలియని దొంగ కండ్లలో కారం పొడి చల్లి చేతితో కొట్టి మెడలోని రెండు తులాల బంగారపు పుస్తెలతాడును లాక్కెళ్ళాడని బాధితురాలు ఫిర్యాదు చేశారని ఆమె తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.

Leave a Reply