TG | గెలిచి వస్తేనే రాజకీయ భవిష్యత్ ఉంటుంది…

TG | గెలిచి వస్తేనే రాజకీయ భవిష్యత్ ఉంటుంది…
TG | నర్సంపేట, ఆంధ్రప్రభ : నర్సంపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలిచిన వారికే రాజకీయ భవిష్యత్తు ఉంటుందని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తరపున 30 వార్డులలో పోటీ చేస్తున్న అభ్యర్థుల పేర్లను మంగళవారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవ రెడ్డి మాట్లాడుతూ… ప్రతి ఒక్కరు ఎన్నికల పోటీలో గెలుపొంది రావాలని దానికోసం వార్డు పరిధిలోని నాయకులు కార్యకర్తలు వార్డు ఇన్చార్జిలు కృషి చేయవలసి ఉంటుందని వివరించారు. నర్సంపేట కాంగ్రెస్ పార్టీ నుండి మున్సిపాలిటీకి పోటీ చేస్తున్న 30 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించారు.
