TG | 15వ అభ్యర్థి బీఫామ్ అందజేత

TG | 15వ అభ్యర్థి బీఫామ్ అందజేత

TG | పరకాల, ఆంధ్రప్రభ : మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ 15వ వార్డు అభ్యర్థి కందుకూరి వేణుగోపాల మూర్తి మున్సిపల్ ఎన్నికల అధికారులకు బీ ఫామ్ అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అభ్యర్థి కందుకూరి వేణుగోపాల మూర్తి మాట్లాడుతూ… పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆశీస్సులతో 15వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుపొందడం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 15వ వార్డులోని ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందన్నారు. వార్డులోని ఓటర్లు బీఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. అభ్యర్థి వెంట బీఆర్ఎస్ నాయకులు మహ్మద్ షబ్బీర్ అలీ తదితరులు ఉన్నారు.

Leave a Reply