TG | మల్లన్న ఆలయ అభివృద్ధికి సహకారం అందిస్తా….

TG | మల్లన్న ఆలయ అభివృద్ధికి సహకారం అందిస్తా….
TG | బిక్కనూర్, ఆంధ్రప్రభ : మండలంలోని గురజాకుంట గ్రామంలో గల మల్లికార్జున స్వామి ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని బిక్కనూరు పట్టణానికి చెందిన ప్రవాస భారతీయుడు వార్డు సభ్యులు జ్ఞాన ప్రకాశ్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ రోజు గ్రామంలో జరిగిన మల్లికార్జున స్వామి ఉత్సవాలలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ ఆలయాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. మల్లన్న స్వామి ఆశీస్సులు ప్రతి కుటుంబానికి ఉండాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. అనంతరం ఆలయం వద్ద ఆయన అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి మల్లన్న స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
