TG | అవినీతికి తావు లేకుండా….

TG | అవినీతికి తావు లేకుండా….

TG | భీమ్‌గల్‌ టౌన్, ఆంధ్రప్రభ : తన భర్త రాజకీయంగా చేసిన అభివృద్ధిని ఆదర్శంగా తీసుకొని తనకున్న రాజకీయ అనుభవంతో ఐదో వార్డును అభివృద్ధి చేస్తానని ఐదో వార్డు బీజేపీ అభ్యర్థి కొండ గోదావరి ప్రకాష్ గౌడ్ అన్నారు. ఈ రోజు బోయిగల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా ఆమె ఇంటింటికి తిరుగుతూ బీజేపీ అభ్యర్థిగా తనను గెలించడానికి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. అవినీతి కి ఆస్కారం లేకుండా ప్రజలకు పనులు చేసి పెడుతానని హామీ ఇచ్చారు. తన కుటుంబం మొదటి నుండి ఆర్థికంగా బలంగా ఉన్నందున తనకు ఎలాంటి అవినీతి సొమ్ము అవసరం లేదన్నారు. ప్రజలకు సేవ చేసేందుకే మున్సిపల్ కౌన్సిలర్ గా బీజేపీ బలపరిచిన అభ్యర్తిగా పోటీలో ఉన్నట్టు పేర్కొన్నారు. కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, అవినీతి లేకుండా అభివృద్ధి చెందుతున్న దేశాన్ని చూసి బీజేపీ కమలం (పువ్వు) గుర్తుకు ఓటు వేయాలని వేడుకున్నారు. ఆమె వెంట కొండ రామగౌడ్, కనికరం మధు, లక్ష్మణ్ గౌడ్ తదితరులు ఉన్నారు.

Leave a Reply