TG | వనపర్తి 33వ వార్డులో ప్రచారం…

TG | వనపర్తి 33వ వార్డులో ప్రచారం…
TG | వనపర్తి, ఆంధ్రప్రభ : వనపర్తి పురపాలక సంఘం పరిధిలోని 33వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి ఎస్ఎల్ఎన్ మాధవి రమేష్ ఈ రోజు ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులతో వార్డులో పర్యటిస్తూ ఇంటింటికి వెళ్లి తమ అభ్యర్థిత్వాన్ని వివరిస్తూ ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ తనను గెలిపిస్తే మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు వార్డు సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు. వనపర్తిఎమ్మెల్యే మెఘా రెడ్డి సహకారంతో వార్డు పురోభివృద్ధికి కృషి చేస్తానని,ఒక్క అవకాశం ఇచ్చి కౌన్సిలర్ గా గెలిపించాలని ఎస్ ఎల్ ఎన్ మాధవి రమేష్ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.
