TG | ఘ‌నంగా ఆలయ వార్షికోత్సవ వేడుకలు..

TG | ఘ‌నంగా ఆలయ వార్షికోత్సవ వేడుకలు..

TG | నిజాంపేట, ఆంధ్ర ప్రభ : మండల కేంద్రంలోని ఈ రోజు షౌకత్ పల్లి గ్రామంలో బంజారుల ఆరాధ్య దైవం అయినటువంటి శ్రీ జగదాంబ సంతు సేవాలాల్ మహారాజ్ ఆలయ 4వ వార్షికోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ మడావత్ సునీత బాబు నాయక్‌ల‌ ఆధ్వర్యంలో అమ్మవారికి వెండి కిరీటం, కడెంను బహుకరించగా బంజారా మహిళల నృత్య ప్రదర్శన మధ్య గ్రామంలో ఊరేగింపుగా ఆలయానికి తీసుకు వెళ్లి అమ్మవారికి సమర్పించడం జరిగింది. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆ జగదాంబ సంతు మహారాజ్ కృప గ్రామ ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ వేడుకలలో భక్తులు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం సేవలాల్ మహారాజ్ ఆలయానికి ప్రముఖ సంఘ సేవకులు కాంగ్రెస్ నాయకులు లీల గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్, హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. సర్పంచ్ తండావాసులు ఆయన ను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ సూర రాములు, గ్రామస్తులు లాల్య, పత్తి, మగ్య, రామ్ చందర్, సూర్య నాయక్, రాజు నాయక్, భాస్కర్ నాయక్, నరేష్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply