TG | ఎమ్మెల్యే ఇంటింటి ప్రచారం…

TG | ఎమ్మెల్యే ఇంటింటి ప్రచారం…
TG | వనపర్తి ప్రతినిధి, ఆంధ్రప్రభ : వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి కల్పన చీర్ల సత్యం సాగర్ కు మద్దతుగా స్థానిక ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా మంగళహారతులతో, డప్పు వాయిద్యాలతో వారికి కాలనీవాసులు ఘనంగా స్వాగతం పలికారు. పుర ఎన్నికలను పురస్కరించుకుని ఈ రజు వనపర్తి పట్టణంలోని 22 వ వార్డులో ఎమ్మెల్యే మార్నింగ్ వాక్ చేపట్టి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… 22 వార్డులో కాంగ్రెస్ పార్టీ తరఫున కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీలో ఉన్న కల్పన చీర్ల సత్యంను హస్తం గుర్తుపై ఓటువేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో పట్టణం నిర్వీర్యం : ఎమ్మెల్యే మేఘారెడ్డి పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో వనపర్తి పట్టణం పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మెఘారెడ్డి అన్నారు. వనపర్తి పట్టణంలోని మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 6 22 వార్డులలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడుతూ… గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి కుంటుబడిందని విమర్శించారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పట్టణంలోని ప్రతి వార్డు అభివృద్ధి చెందుతుందని, ఇప్పటికే 100 కోట్ల పనులు చేపట్టి ప్రతి గల్లీలో సీసీరోడ్ల నిర్మాణం మురుగు కాలువల నిర్మాణం చేపట్టామన్నారు. ప్రతి వార్డులో కమ్యూనిటీ హాల్స్, ప్రత్యేక వీధి దీపాలు ఏర్పాటు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.
ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు, సన్న బియ్యం ఉచిత విద్యుత్, ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, మహిళా సమైక్య భవనాల నిర్మాణం, మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం క్యాంటీన్లో ఏర్పాటు, కుట్టు మిషన్ల పంపిణీ, మహిళను గౌరవించుకునే విధంగా ఇందిరమ్మ చీరల పంపిణీ లాంటి అనేక సంక్షేమ పథకాలను చేపట్టినట్లు వివరించారు.
