TG | బచ్చన్నపేటలో సీఎం దిష్టిబొమ్మ దగ్ధం …

TG | బచ్చన్నపేటలో సీఎం దిష్టిబొమ్మ దగ్ధం …
TG | బచ్చన్నపేట, ఆంధ్రప్రభ : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ నోటీసులు పంపడాన్ని నిరసిస్తూ బచ్చన్నపేట మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోనూ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆదేశానుసారం ఊరురా సర్పంచులు గ్రామ శాఖ అధ్యక్షులు సమక్షంలో భారీ నిరసన సీఎం దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమాలు చేపట్టారు. ఈ రోజు మండల కేంద్రంలోని చౌరస్తాలోను పలు గ్రామాల్లోను సిట్ నోటీసులు నిరసిస్తూ చేపట్టిన కార్యక్రమంలో బచ్చన్నపేట, కొన్నే, నక్క వాణి గూడెం, సాల్వాపూర్, బండ నాగారం, దబగుంటపల్లి, పలు గ్రామాల్లోనూ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు కార్యకర్తలు ప్లే కార్డ్స్ చేబూని నిరసన ఆందోళనలు వ్యక్తం చేశారు. ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు…
