TG | 31వ వార్డులో ఇంటింటి ప్రచారం

TG | 31వ వార్డులో ఇంటింటి ప్రచారం
TG | వనపర్తి,ఆంధ్రప్రభ : వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని 31 వ వార్డు బీఆర్ ఎస్ అభ్యర్థి షేక్ జహంగీర్ ఆదివారం ఇంటింటి ప్రచారం ప్రారంభించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులతో వార్డులోని కాలనీలలో తిరుగుతూ ఇంటింటికి వెళ్లి ప్రచారాన్ని చేపట్టారు. మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వం గతంలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను గుర్తుచేస్తూ వనపర్తి లో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను గుర్తించి బిఆర్ఎస్ ను గెలిపించాలని కోరారు. వార్డు అభివృద్ధి కోసం చేయూతనిచ్చేలా కార్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు.
