TG | రక్త నిధికి దాతల వెల్లువ

TG | రక్త నిధికి దాతల వెల్లువ

TG | మంచిర్యాల సిటీ, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రక్త నిధి కేంద్రంలో రక్త యూనిట్లు నిలువలు తక్కువగా ఉన్నాయన్న వార్త కథనాలు శనివారం వెలువడడంతో స్పందించిన దాతలు 30 మంది రెడ్ క్రాస్ రక్త నిధి కేంద్రంలో రక్తదానం చేశారు. 30 మందిని మంచిర్యాల రక్త నిధి కేంద్ర ఇన్చార్జ్ వి మధుసూదన్ రెడ్డి, రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షులు కే భాస్కర్ ప్రశంసించి పత్రాలను అందించారు. మంచిర్యాల మరిన్ని స్వచ్ఛంద సంస్థలు, యువకులు స్వచ్ఛందంగా తరలివచ్చి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. ప్రమాదాలు గర్భిణీలు బాధితులు వృద్ధులకు ఈ రక్తం వినియోగంలోకి రానుందని రక్త దానాన్ని చేసి ప్రాణదాతలుగా నిలవాలని వారు పిలుపునిచ్చారు.

Leave a Reply