TET EXAM | ఇద్దరు దుర్మరణం

TET EXAM | ఇద్దరు దుర్మరణం

  • బైకు ఢీ కొట్టిన లారీ
  • ఇంటినుంచి బయలుదేరిన పదిహేను నిమిషాల్లో ప్రమాదం

TET EXAM | వలిగొండ, ఆంధ్రప్రభ : యాదాద్రి జిల్లా వలిగొండ మండలంలోని నర్సాపురం గ్రామ పరిధిలోని బోరబండగూడెం మెయిన్ రోడ్డుపై ఈరోజు ఉదయం ఎనిమిదిన్నర గంటలకు లారీ ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. మోత్కూరు మండలం ముసిపట్ల గ్రామానికి చెందిన కొ క్కల సాయి (20 ) మోత్కూరు (Mothkur) చెందిన తన మిత్రునితో కలిసి భువనగిరి కి బైక్ పై వెళ్తుండగా బోడ బండ గూడెం వద్ద బైకు ను కంటైనర్ లారీ (Lorry) ఢీకొట్టింది. దీంతో టైర్ల కింద పడి ఇద్దరు నలిగి పోయి మృతి చెందారు. ఇంటి నుండి బయలుదేరి 15 నిమిషాలు తరువాత దుర వార్త విన వలసి వచ్చిందని కుటుంబ సభ్యులు, బంధువులు తల్లిదండ్రులు లబోదిబో మంటూ సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను చూసి రోదిస్తున్నారు. ఇద్దరు యువకులు బోనగిరి లో నిర్వహించే టెట్ పరీక్షకు హాజరూ కావడానికి వెళ్తున్నట్లు తెలుస్తోంది.

TET EXAM

TET EXAM

CLICK HERE TO READ మైనర్ల డ్రైవింగ్ ప్రాణాంతకం…

CLICK HERE TO READ MORE

Leave a Reply