ముమ్మడివరంలో పదేళ్ల బాలికపై లైంగిక దాడి

ఆంధ్రప్రభ, ముమ్ముడివరం : తూర్పు గోదావరి జిల్లా తునిలో మైనర్ బాలికపై అఘాయిత్యం ఘటన మరువకముందే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరో కీచక పర్వం వెలుగులోకి వచ్చింది. చాక్లెట్లు కొనిస్తానని ఓ పదేళ్ల బాలికకు మాయ మాటలు చెప్పి .. ఓ పీయిటీ మాస్టార్ పలు మార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

ఈ కేసులో నిందితుడు జనసేన పార్టీలో యాక్టివ్ పని చేస్తున్నాడు. దీంతో ఈ కేసు తీవ్ర సంచలనానికి దారి తీసింది. వివరాలు ఇలా ఉన్నాయి.. తన బిడ్డకు చాక్లెట్స్ కొంటానని చెప్పి తన రూమ్ కి తీసుకు వెళ్లి పియీటీ అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆ బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఐ.పోలవరం మండలం బాణాపురానికి చెందిన ఆరవ తరగతి బాలికను జనసేన నాయకుడు రాయపురెడ్డి సత్య వెంకట కృష్ణ (బాబీ) స్కూలుకు సమీపంలోని ఒక భవనంలోకి తీసుకువెళ్లాడు. ఆమెపై లైంగిక దాడికి పాల్పడి బిల్డింగ్ లోంచి బయటికి రావడం చూసిన బాలిక తల్లి నిలదీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

జిల్లా ఎస్పీకి బాలిక తల్లి బందువులు ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాలతో బాలిక తల్లి నుండి పిర్యాదు తీసుకుని 6 ఎ ఫోక్సో, సెక్షన్ 725 కిందట ముమ్ముడివరం పోలీసులు కేసు నమోదు చేశారు.

Leave a Reply